భూసమస్యలు పరిష్కారానికే భూభారతి

భూసమస్యలు పరిష్కారానికే భూభారతి

:తహసీల్దార్ నరేష్

విశ్వంభర, నెల్లికుదురు:  భూ సమస్యలు లేకుండా ఉండేందుకే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూభారతి తీసుకువచ్చిందని తహ సిల్దార్ చంద నరేష్ తెలిపారు. నెల్లికుదురు మండలం లో పైలెట్ ప్రాజెక్టు లో భాగంగా రామానుజాపురం ఎంపిక కాగా ఈ మేరకు భూ భరోసా గ్రామ సభ గురువారం నిర్వహించారు.దీనికి తహసిల్దార్ నరేష్ హాజరై మాట్లాడుతూ భూభారతి సర్వేలో మొదట గ్రామ సరిహద్దులు,అనంతరం ప్రభుత్వ భూములు,చెరువు శిఖాలు మొదలైనవి గుర్తిస్తారన్నారు. గ్రామంలో ఏరియాల వారీగా అధికారులు చాటింపు చేసి సర్వే చేస్తారని ఆ ఏరియా కు సంబంధించిన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇకనుంచి ఒక్కో రైతుకు ఒక్కో సర్వే నెంబర్ కేటాయిస్తారని బై నెంబర్లు ఉండవని తెలిపారు. సభలో మ్యాపులున్నవికరణ,సరిహద్దుల గుర్తింపు,ప్రభుత్వ భూముల రక్షణ,పహనీల రికార్డులు,పట్టాదారుల భాగస్వామ్యం,వివాదాల పరిష్కారం,సాంకేతికత వినియోగం, అప్పీలు చేసుకునే అవకాశం వంటి అంశాలను చర్చించారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్ జిలకర సాంబమూర్తి, ఇన్స్పెక్టర్ దార రామకృష్ణ, సర్వేయర్ భాష్మియా,మాజీ ఎంపీటీసీ అనిల్ గౌడ్,రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.

🕒 03 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bhubharati-is-for-solving-land-problems/article-17778

Tags: