ఎంగ్ ఇండియా స్కూల్స్... విద్యా సంస్కరణలా? లేక వేల కోట్ల స్కామా..?
విశ్వంభర, డెస్క్ /హైదరాబాద్ :- తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఎంగ్ ఇండియా స్కూల్స్ ప్రాజెక్టుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ప్రభుత్వ వర్గాలు రాష్ట్ర విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు ఎంగ్ ఇండియా నాంది పలికుంతుందని అంటున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు మాత్రం భారీ అవినీతి జరిగే అవకాశమున్న ప్రాజెక్టుగా ఆరోపిస్తున్నాయి.
రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అత్యాధునిక తరగతి గదులు, వసతి గృహాలు, క్రీడా మైదానాలు, ప్రయోగశాలలు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలతో ఈ విద్యాసంస్థలను అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అయితే ఒక్కో పాఠశాల నిర్మాణానికి వందల కోట్ల రూపాయల వ్యయం ప్రతిపాదించడం ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ప్రతిపక్షాల ఆరోపణల ప్రకారం, కొన్ని ప్రాంతాల్లో ఒక్కో స్కూల్ నిర్మాణ వ్యయం రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు చేరుకుంటోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు అంత భారీ వ్యయం అవసరమేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
విద్యారంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం, నాణ్యమైన విద్య కోసం మౌలిక సదుపాయాలు అవసరమే అయినప్పటికీ, వ్యయానికి సంబంధించి పూర్తి పారదర్శకత ఉండాలని సూచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా అనేక ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల లోపం, భవనాల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిలో, కొన్ని ఎంపిక చేసిన విద్యాసంస్థలపైనే భారీగా నిధులు కేటాయించడం సముచితమేనా అనే అంశంపై చర్చ జరగాలని వారు చెబుతున్నారు.
ప్రతిపక్ష నేతలు మరో అడుగు ముందుకేసి ఈ ప్రాజెక్టు వెనుక కాంట్రాక్టర్ల ప్రయోజనాలు దాగి ఉన్నాయంటూ ఆరోపిస్తున్నారు. టెండర్ల కేటాయింపు, నిర్మాణ వ్యయ అంచనాలు, భూముల ఎంపిక తదితర అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల పన్నుల డబ్బుతో చేపడుతున్న ప్రాజెక్టు కావడంతో ప్రతి రూపాయి ఖర్చుపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని పేర్కొంటున్నారు.
మరోవైపు అధికార పార్టీ నేతలు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. గతంలో గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలు మంచి ఫలితాలు సాధించినట్లుగానే, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థను నిర్మించేందుకు ఈ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకునేందుకు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, భారీ పెట్టుబడులతో నిర్మించే విద్యాసంస్థల విషయంలో ఖర్చు-ప్రయోజనాల విశ్లేషణ తప్పనిసరని అంటున్నారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఎంత వ్యయం చేస్తోంది, అదే నిధులతో ఎన్ని సాధారణ ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయవచ్చనే అంశాలను కూడా ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీపై జరుగుతున్న రాజకీయ చర్చల మధ్య ఎంగ్ ఇండియా స్కూల్స్ అంశం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ప్రాజెక్టు నిజంగా విద్యా రంగంలో కొత్త ప్రమాణాలు సృష్టిస్తుందా? లేక ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా భారీ వ్యయ వివాదంగా మిగిలిపోతుందా? అన్నది కాలమే వేచి చూడాల్సిన అంశంగా మారింది.
అయితే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు చేపట్టే ప్రతి భారీ ప్రాజెక్టుపై ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉందని, ఆ ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.