మాజీ వార్డు సభ్యులు మృతి.
కుటుంబ సభ్యులను పరామర్శించిన మదర్ డెయిరీ మాజీ చైర్మన్ ప్రగాఢ సంతాపం.
On
విశ్వంభర, రామన్నపేట: మండలంలోని శోభనాద్రిపురం గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు కంచి మైసయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఆదివారం నార్ మార్క్స్ (మదర్ డెయిరీ) మాజీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి మైసయ్య భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నివాళులర్పించిన వారిలో కంచి శంకరయ్య, కడారి ఐలయ్య, గోపాల్ రెడ్డి, పాపయ్య, తాడూరి సోమయ్య, గడ్డమీద స్వామి, తదితరులు ఉన్నారు.



