అక్రమ అరెస్టులను తక్షణమే  ఆపాలి .

తెలంగాణ ఉద్యమకారుల జిల్లా ఫోరం అధ్యక్షులు బో ర్రాజు లింగన్న యాదవ్ .

అక్రమ అరెస్టులను తక్షణమే  ఆపాలి .

విశ్వంభర,మహబూబాబాద్ జిల్లా : అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్నారనే  ఉద్దేశంతో  తెలంగాణ ఉద్యమకారుల నీ  మహబూబాబాద్ పోలీసుల అక్రమ అరెస్టులను తక్షణమే ఆపాలని  తెలంగాణ ఉద్యమ కారుల  ఫోరం   మహబూబాబాద్  జిల్లా అధ్యక్షులు బోర్రాజు లింగన్న యాదవ్ ఖండించారు . ఈ సందర్భంగా లింగన్న యాదవ్ మాట్లాడుతూ  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తెలంగాణ ఉద్యమకారులను అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం ప్రతి ఒక్కరూ ఖండించాలని ,  ప్రభుత్వ తీరుపై అగ్రహం వ్యక్తం చేశారు .   రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీల లో భాగంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ  , చేత తెలంగాణ మలిదశ ,  తొలి దశ ,  ఉద్యమకారులకు పెన్షన్స్ సౌకర్యం 25, 000 వేల రూపాయలు,  250 చదరపు గజాల  ఇంటి స్థలంతో పాటు ,  ఇందిరమ్మ ఇల్లు ,  ప్రభుత్వ ప్రశంసాపత్రాలు, రైల్వే పాసులు , బస్సు పాసులు , మరియు ఆరోగ్య భీమా ,  కల్పిస్తానని అట్టి హామీని  తక్షణమే నెరవేర్చాలని, ఉద్యమకారులు శాంతియుతంగా గత రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తుంటే తీవ్రవాదుల కంటే హీనంగా ఉద్యమకారులను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని హెచ్చరించారు . జూన్ రెండు లోపు ఉద్యమకారులకు ఇచ్చిన హామీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చకుంటే ఉద్యమకారుల ఉద్యమాన్ని  దశలవారీగా తీవ్రతరం చేసి హాక్కులను సాధించుకునే దిశగా ముందుకెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు .  ఒకపక్క ఉద్యమకారులు ఆర్థికంగా నష్టపోయి కుటుంబాలను పోషించుకోలేని స్థాయిలో తీవ్ర దుర్భర జీవితాలు అనుభవిస్తూ రోగాల బారినపడి అనేక మంది ఉద్యమకారులు మరణిస్తుంటే ప్రభుత్వానికి పట్టదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు .  ఉద్యమకారుల పట్ల కాలయాపన చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎంతకైనా తెగించి తీరుతామని వారు అన్నారు. జార్ఖండ్ తరహాలో ఉద్యమకారులను ఆదుకోవాల్సిన అవసరం రేవంత్ ప్రభుత్వం పై ఉందని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో  వీరబోయిన నరేష్ యాదవ్ , తేజావత్  వినయ్ ,  తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు .

🕒 16 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/illegal-arrests-should-be-stopped-immediately/article-15333

Tags: