మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం
* అందించిన తుమ్మల నరసయ్య సేవాసమితి
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరూరు గ్రామానికి చెందిన పోలెపాక యెట్టయ్య సోమవారం అనారోగ్యంతో మరణించారు. తుమ్మల నరసయ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మల నరసయ్య సేవా సమితి గౌరవాధ్యక్షులు బండారు నరసింహారెడ్డి, అధ్యక్షులు కసిరబోయిన లింగయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తుమ్మల శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆవుల సత్యనారాయణ, తుమ్మల సంతోష్, మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి, సేవా సమితి కార్యదర్శి పిట్టల సుధాకర్, ఆవుల అంజయ్య, సుక్క రామచంద్రయ్య, సుంకి ఆనంద్, నరసింహ బోగారం ఎల్లయ్య తదితరులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.



