బోడుప్పల్ సర్కిల్ లో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుల నియామకం
విశ్వంభర, బోడుప్పల్ : బోడుప్పల్ సర్కిల్ -10 పరిధిలోని బోడుప్పల్, చెంగిచెర్ల డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ కమిటీ నూతన అధ్యక్షుల పేర్లను మహేష్ కుమార్ గౌడ్ గురువారం ప్రకటించారు. బోడుప్పల్ డివిజన్ అధ్యక్షుడుగా మాజీ కార్పొరేటర్ యువనేత బొమ్మకు కళ్యాణ్ కుమార్, 12వ డివిజన్ చెంగిచెర్ల డివిజన్ అధ్యక్షుడుగా పోగుల దిలీప్ రెడ్డిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ సలహా మేరకు బోడుప్పల్ సర్కిల్ డివిజన్లో కమిటీ అధ్యక్షులు నియామకాన్ని చేపట్టారు. డివిజన్ల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నియామకంలో పార్టీ అధిష్టానవర్గం యువకులకే ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ సందర్భంగా అధ్యక్షులుగా నియమితమైన బొమ్మకు కళ్యాణ్ కుమార్, పోగుల దిలీప్ రెడ్డిలు మాట్లాడుతూ బోడుప్పల్, చెంగిచెర్ల డివిజన్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని తమపై నమ్మకం ఉంచి బాధ్యతలను అప్పగించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్నసంక్షేమ పథకాలను పేద ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా తమవంతు కృషి చేస్తామని వెల్లడించారు. త్వరలోనే జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే ధ్యేయంగా తమ వంతు బాధ్యత నిర్వహిస్తామని తెలిపారు. డివిజన్ కమిటీ అధ్యక్షులుగా నియమించడంలో సహకరించిన టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తోటకూర వజ్రెష్ యాదవ్, బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.