సర్కారు బడులలోనే వసతులతో కూడిన బోధన
- దిశ కమిటీ సభ్యులు బాబురావు
విశ్వంభర, ఇనుగుర్తి: సర్కారు బడులలోనే వసతులతో కూడిన సమర్థవంతమైన విద్యా బోధన విద్యార్థులకు చేకూరుతుందని దిశ కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు అన్నారు. మండల కేంద్రం ఇనుగుర్తి ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు విద్యాభివృద్ధి కమిటీ సభ్యులు,వార్డు సభ్యులతో కలిసి ఉపాధ్యాయ బృందం యాదవ బజార్ లో బడిఈడు పిల్లలను, వారి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ బడిలో జాయిన్ చేయాలని సర్కార్ బడి విశిష్టతలను వివరించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన బాల,బాలికలకే ప్రభుత్వ పథకాలు వర్తించే అవకాశం ఉందన్నారు.అనంతరం ఇద్దరు బాలురు,ఒక బాలిక ప్రవేశం పొందారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నద్దునూరి ప్రశాంత్, హెచ్ఎం వీరన్న, టీచర్స్ ఎం.వెంకటేశ్వరాచారి, కె.రేవతి, జి.వైడూర్యం, పి.సారంగపాణి, నిర్మల, బాబురావు, ప్రశాంత్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.