7వ రోజు స్కూలు విద్యార్థులకు కంటి పరీక్షలు
విశ్వంభర, షాద్ నగర్: షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 7వ రోజు కంటి చూపు లోపాలు ఉన్న విద్యార్థులకు కంటి వైద్యులతో ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల వారి కంటి చూపు లోపాల కు, అనుగుణంగా కంటి అద్దాలను గుర్తించి,తెలంగాణ ప్రభుత్వ నుండి తెప్పించి విద్యార్థులకు అందజేస్తారు. ఈ కంటి పరీక్షలకు శంషాబాద్ నుండి, మహేశ్వరం నుండి, అమనగలు నుండి మరియు షాద్ నగర్ డివిజన్ నుండి ప్రతిరోజు ఆర్ బి ఎస్ కే వాహనాల ద్వారా ఆర్ బి ఎస్ కె వైద్య అధికారులు విద్యార్థులను షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి కంటి పరీక్షలు జరిపించుకొని మళ్లీ తిరిగి వారి వారి స్కూళ్లకు మరియు హాస్టళ్లకు చేరవేస్తున్నారు. ప్రస్తుతం వేసవి కాలం ఎండలు ఎక్కువగా ఉండడం వలన ప్రభుత్వం విద్యార్థులకు ఏర్పాటు చేసిన గుడ్ డే బిస్కెట్లు మరియు వాటర్ బాటిలను షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు విద్యార్థులకు పంపిణీ చేశారు. సోమవారం మొత్తం 281మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం జరిగిందని, ఇప్పటి వరకు మొత్తం 2581 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని డాక్టర్ శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్యులు డాక్టర్ సౌజన్య, డాక్టర్ పద్మలత, డాక్టర్ పుష్పలత, అత్తమ్మలజిస్ట్ లు రమేష్, నరేందర్ రెడ్డి, చంద్రశేఖర్, ఆర్ బి ఎస్ కే వైద్యులు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ సంధ్య,డాక్టర్ రాగిణి, డాక్టర్ కార్తీక్, డాక్టర్ సంధ్య మరియు ఫార్మసిస్టులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.



