జిపి భవన నిర్మాణం నిలిపివేయాలని ధర్నా
విశ్వంభర, ఇనుగుర్తి: పంతులు తండాలో భూమి పూజ చేసిన గ్రామపంచాయతీ భవన నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ మీట్య తండా, మర్రికుంట తండా,లైన్ తండాల వాసులు మండల కేంద్రం ఇనుగుర్తి లోని నెల్లికుదురు కేసముద్రం ప్రధాన రహదారిపై సోమవారం ధర్నా నిర్వహించారు. అన్ని తండాలకు అనుకూలమైన చోట నిర్మించాలని, ఎంపీడీవో తహసీల్దార్ వచ్చి హామీ ఇవ్వాలని నినాదాలు చేశారు. దీంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎస్సై గంగారపు కరుణాకర్ తమ సిబ్బందితో వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తహసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో బండారి పార్థసారథి ఆందోళన చేస్తున్న వారి వద్దకు వచ్చి తండావాసులతో మాట్లాడారు. బిఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచి బానోతు నరేష్,బానోతు బాలు నాయక్, బానోతు రమేష్ మాట్లాడుతూ అన్ని తండాలకు అనుకూలమైన చోట సంబంధిత గ్రామపంచాయతీని నిర్మించాలని అధికారులకు చెప్పారు. ఏకపక్షంగా సర్పంచి భూక్య చిన్ని పంతులు తండాలో జిపి భవనం నిర్మిస్తే ఇతర తండాల వాసులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందన్నారు.వెంటనే నిర్మాణ పనులను నిలిపివేయాలని కోరారు. అంతకుమునుపు ఉదయం ఈ మేరకు ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశామన్నారు. తహసిల్దార్ శ్రీనివాసులు ఎంపీడీవో పార్థసారధి మాట్లాడుతూ ఉదయం వినతిపత్రం ఇచ్చారని మధ్యాహ్నం మళ్లీ రోడ్డు పైకి వచ్చి ఆందోళన చేయడం సమంజసం కాదని,అన్ని తండాల వారు ఏకాభిప్రాయానికి వచ్చి జిపి బిల్డింగ్ నిర్మించుకోవాలని సూచించారు.ఈ మేరకు తాము కూడా విచారణ చేస్తామని తెలిపారు. దీంతో ఆందోళనకారులు తమ ధర్నాను ఉపసంహరించుకున్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుగులోతు రంగమ్మ శ్రీను, వార్డు సభ్యులు పద్మ వెంకన్న, జి తస్మా కీమా,బి మౌనిక, గుగులోతు బిక్షపతి, మాజీ ఉపసర్పంచి భూఖ్య రాములు, భూక్య ప్రభాకర్,బానోతు వెంకన్న,భానోతు భాస్కర్, భానుతు వెంకన్న, గుగులోతు వెంకన్న,సురేష్, గుగులోతు శ్రీను ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.