అడిషనల్ కలెక్టర్ మోడల్ స్కూల్ తనిఖీ
On
విశ్వంభర, నెల్లికుదురు: జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టెప్పో నెల్లికుదురు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ను, అంగన్వాడి కేంద్రాన్ని ఎంపీడీవో సింగారపు కుమార్ తో కలిసి మంగళవారం తనిఖీ చేసారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల్లోని పఠనాశక్తిని,విద్యా ప్రమాణాలను పరిశీలించారు.ఆయా సబ్జెక్టులపై ఎంత పట్టు ఉందో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.చదువు పట్ల ఆసక్తి కలిగి ఉంటూ క్రమశిక్షణతో విద్యార్జన చేయాలని స్టూడెంట్స్ కు సూచించారు. లక్ష్యాలను ఎంచుకొని వాటి సాకారానికి ఇప్పటి నుంచే కృషి చేయాలన్నారు.రిజిస్టర్లను తనిఖీ చేశారు.విద్యార్థులలో కంప్యూటర్ నైపుణ్యాన్ని పరిశీలించారు. భోజన వసతి గదిని, పరిసరాలను చూశారు. మెనూ ప్రకారం భోజనం అందించడం పై ఆరా తీశారు. అంగన్వాడి సెంటర్ ను సందర్శించి రికార్డులను పరిశీలించారు.పౌష్టికాహారం సరఫరా, లబ్ధిదారులకు పంపిణీ పై పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచి పులి వెంకన్న, ఎంపీ ఓ పద్మ, పంచాయతీ కార్యదర్శి వేదరాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.



