పంచాయతీ పాలకవర్గానికి సన్మానం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణను, ఉప-సర్పంచ్ మోటే రమేష్, గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి గౌరవ అధ్యక్షులు రెబ్బసు రాములు ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించి, ఘనంగా సన్మానించడం జరిగినది. అనంతరం మాట్లాడుతూ, రామన్నపేట ఒకప్పుడు ఇబ్రహీంపట్నం నుంచి ఆలేరు వరకు నల్గొండ నుంచి శాలిగౌరారం వరకు సమితిగా ఉండేదని, 1952 నుంచి 2009 వరకు నియోజకవర్గ కేంద్రంగా ఉండేదని, అనంతరం నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా నకిరేకల్ నియోజకవర్గంలో కలవడం జరిగిందని, రామన్నపేట ప్రత్యేక నియోజకవర్గం ఏర్పడాలని, గత కొంత కాలంగా మండలంలోని అన్ని గ్రామాల నుంచి రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఏర్పాటు చేసుకొని వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ అధికారుల దృష్టికి, ప్రజా ప్రతినిధుల దృష్టికి రామన్నపేట నియోజకవర్గ ఏర్పాటు చేయాలని, వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని, అందులో భాగంగా రామన్నపేట మండల వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులను సన్మానించడం జరిగిందని, రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉప-సర్పంచ్ మోటే రమేష్, మరియు పాలకవర్గాన్ని సన్మానిస్తూ రామన్నపేట నియోజకవర్గ సాధన సమితికి మద్దతు ఇవ్వాలని తెలపడం జరిగిందని తెలిపారు. అనంతరం సర్పంచ్ గరిక సత్యనారాయణ సాధన సమితి గౌరవ అధ్యక్షులు రెబ్బసు రాములును సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సాధన సమితి నాయకులు గడ్డం యాదగిరి, బందెల అశోక్, ఎండి ఇమామ్ సాబ్, నకిరేకంటి నరేష్, పెండెం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.



