ఆఫీసులు పరిశుభ్రం

ఆఫీసులు పరిశుభ్రం

విశ్వంభర, నెల్లికుదురు: ప్రగతి ప్రణాళిక లో భాగంగా మొదటి రోజు శుక్రవారం నెల్లికుదురు మండల పరిషత్ కార్యాలయం తో పాటు మండలంలోని వివిధ గ్రామపంచాయతీల కార్యాలయాలను సర్పంచులు,పంచాయితీ కార్యదర్శులు సిబ్బందితో పరిశుభ్రం చేయించారు. ఈ సందర్భంగా ఆఫీసు లలోని బూజును దులిపారు. కార్యాలయాల పైన పేరుకు పోయి ఉన్న దుమ్మును ఊడ్చి వేశారు. బీరువాలను,రికార్డులను పరిశీలించి చెత్తాచెదారాన్ని తొలగించారు. కార్యాలయాలను పరిశుభ్రంగా నీటితో కడిగించారు. పరిసరాల లోని పిచ్చి మొక్కలను, ముళ్ళ కంప చెట్లను,గడ్డిని తొలగించారు.

Tags: