బెంగళూరు రోడ్లపై మళ్లీ ‘బైక్ ట్యాక్సీ’ల జోరు

బెంగళూరు రోడ్లపై మళ్లీ ‘బైక్ ట్యాక్సీ’ల జోరు

ఐటీ సిటీ ప్రయాణికులకు కర్ణాటక హైకోర్టు తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా రాష్ట్రంలో బైక్ ట్యాక్సీ సేవలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.

విశ్వంభర, నేషనల్ బ్యూరో: ఐటీ సిటీ ప్రయాణికులకు కర్ణాటక హైకోర్టు తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా రాష్ట్రంలో బైక్ ట్యాక్సీ సేవలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. గతేడాది జూన్‌లో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పక్కనపెట్టిన న్యాయస్థానం, కొన్ని నిబంధనలతో ఈ సేవలను పునరుద్ధరించవచ్చని స్పష్టం చేసింది. ఇకపై బైక్ ట్యాక్సీలను సాధారణ వాహనాలుగా కాకుండా, వాణిజ్య వాహనాలుగా పరిగణించాలని కోర్టు ఆదేశించింది. బైక్ ట్యాక్సీలుగా నడపాలనుకునే వాహన యజమానులు రవాణా శాఖ నుండి అధికారికంగా లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఓలా, ఉబెర్, రాపిడో వంటి అగ్రిగేటర్లు కొత్త నిబంధనల ప్రకారం తమ దరఖాస్తులను సమర్పించుకోవడానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

2025 జూన్‌లో కర్ణాటక హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా బైక్ ట్యాక్సీ సేవలు నిలిచిపోయాయి. దీనివల్ల వేలాది మంది బైక్ రైడర్లు ఉపాధి కోల్పోగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై అగ్రిగేటర్ సంస్థలు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా, సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పుపై కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి స్పందించారు. కోర్టు తీర్పును తాము గౌరవిస్తామని.. దీనిపై శాఖాపరమైన చర్చలు జరిపిన తర్వాత ప్రభుత్వం తరఫున తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

Read More ఇండియా ధైర్యానికి సజీవ సాక్ష్యమే సోమనాథ్: మోదీ