ఘనంగా శ్రీ భక్త మార్కండేయ జయంతి 

ఘనంగా శ్రీ భక్త మార్కండేయ జయంతి 

విశ్వంభర, హైదరాబాద్ :-శ్రీ భక్త మార్కండేయ జయంతిని పురస్కరించుకొని నారాయణ గూడలోని రాజ్ మొహాల్ల లో ఉన్న పద్మశాలి భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం జనరల్ సెక్రటరీ రాంచందర్, గ్రేటర్ హైదరాబాద్ యూత్ ప్రెసిడెంట్ రాకేష్, గ్రేటర్ హైదరాబాద్ మహిళా విభాగం ప్రెసిడెంట్ పోరండ్ల శారదా మార్కండేయ స్వామి చిత్రపటానికి పూలమాల వేసి, దీపారాధన చేయడం జరిగింది. అఖిల భారత పద్మశాలి యువజన విభాగం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ సంగా పిలుపుమేరకు  చేపట్టిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. యువజన విభాగానికి చెందిన వైస్ ప్రెసిడెంట్ అయిటిపాముల స్రవంతి సభ్యులు వనం విద్య, బర్రెంకల ప్రియ, కందగట్ల చేతన, గడిపెల్లి శ్రీలేఖ, ఆధ్వర్యంలో జరిగింది.  మార్కండేయ శ్లోకాలు,  భక్తి భావంతో కూడిన పద్యాలు పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో తిరుమల, సుకన్య, రమాదేవి, వీణ, దీపిక, శోభ, అశ్విని, సుజాత, హేమలత, కృష్ణ సంతోషి, స్వరూప, వర్ణలేఖ,ఉష శ్రీ, నరేందర్, తిలక్,శారదా, విశ్వశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: