మార్వాడీ హటావో తో దద్దరిల్లిన ఎల్బీనగర్ - ఏ ఒక్క మార్వాడీని వదిలిపెట్టం - డా. కాచం
తెలంగాణ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో నిరసనలు
విశ్వంభర, హైద్రాబాద్ : గుజరాతీ, రాజస్థానీ మార్వాడీ వ్యాపారి హటావో.. తెలంగాణ వ్యాపారి బచావో., అనే నినాదంతో వైశ్య వికాస వేదిక చైర్మన్ డా. కాచం సత్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎల్బీనగర్ లో శ్రీకాంతాచారి, జగ్జీవన్ రామ్, అంబేడ్కర్ విగ్రహాల కూడలి నుండి ఎల్బీనగర్ చౌరస్తా వరకు స్థానిక వ్యాపారులు ర్యాలీ తో పాటు తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్బంగా డా. కాచం మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం తరువాత మరోసారి యావత్తు తెలంగాణ వ్యాపారస్తులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని డా. కాచం పిలుపునిచ్చారు. మార్వాడీలు తమ వ్యాపారాలను పట్టణం నుంచి పల్లె వరకు విస్తరించి రాష్ట్రంలో ఆర్ధిక విధ్వంసం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ సంస్కృతినీ కూడా విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. దీనితో తెలంగాణ లోని విశ్వ బ్రాహ్మణులు , చేనేత కార్మికులతో పాటు వివిధ కులవృత్తులు , చిరు వ్యాపారాలు నిర్వీర్యం అయిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే తెలంగాణ రాష్టంలో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారి మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందన్నారు. మార్వాడీలు తమ వ్యాపారాల్లో ఎక్కడ కూడ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదన్నారు. ఈ ప్రాంత వ్యాపారాలపై మార్వాడీలు తమ ఉక్కు పాదం మోపుతూ అజమాయిషీ చెలాయిస్తున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని మార్వాడీల వ్యాపారాలకు అడ్డుకట్ట వేయకపోతే రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని వైశ్య వికాస వేదిక చైర్మన్ డా. కాచం సత్యనారాయణ గుప్త పేర్కొన్నారు. ఒక జాతీయ పార్టీలోని ఉన్న కొంతమంది వైశ్య నాయకులు తమ రాజకీయ లబ్ది కోసం వైశ్య సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రయత్నాన్ని ఆపకపోతే ఆనాయకులకు తగిన బుద్ది చెప్తామని హెచ్చరించారు . వైశ్య వికాస వేదిక ఎల్లప్పుడూ పేద వైశ్యులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ కర్మ సంఘ నాయకులు పాండురంగ చారి , సల్వా చారి , రామాచారి, యాదవ సంఘం నాయకురాలు ఉపేంద్ర యాదవ్ , తెలంగాణ వనరుల పరిరక్షణ సమితి అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ , టిఎఫ్టి యూ నాయకులూ ఉప్పల శ్రవణ్ గుప్త , వైశ్య వికాస వేదిక ప్రతినిధులు నంగునూరు రమేష్, కాసం సాయి, కొత్త రవి గుప్త , కూర రమేష్ , నిఖిల్ గుప్త, కొదుమూరి దయాకర్ రావు, సాంబశివ గౌడ్, వీరేందర్, వంగవీటి శ్రీనివాస్, తేలుకుంట్ల రాంబాబు, శ్రీనివాస్, శ్రీధర్, మహేష్ , ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.



