ఎడ్లబండ్ల ఊరేగింపులో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ రజిత వెంకటేష్
విశ్వంభర, పరిగి: మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో ఏరువాక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఎడ్లబండ్ల ఊరేగింపు ర్యాలీలో మున్సిపల్ చైర్ పర్సన్ రజిత వెంకటేష్, మున్సిపల్ కమిషనర్ మల్లేష్, పరిగి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ అయ్యుబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతన్నల తొలి అడుగు తొలకరి జల్లుల తర్వాత మంచి వర్షాలు కురిసి భూమి పచ్చదనం కావాలని పంటలు బాగా పండాలని రైతులు ప్రకృతిని భూమాతను ప్రార్థిస్తూ వ్యవసాయ పనులు ప్రారంభిస్తారని అన్నారు. రైతులు తమ వ్యవసాయ పనిముట్లు నాగలి, ఎడ్ల బండ్లు శుభ్రం చేసి పూజలు నిర్వహిస్తారని ఎడ్లని అలంకరించి పొలాల్లో తొలి విత్తనాలు సాంప్రదాయం ఉన్న పండగ ఏరువాక పౌర్ణమి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సర్వర్, రియాజ్, షాహిద్, అబ్దుల్ రఫీ బాయ్, తదితరులు పాల్గొన్నారు.