విద్యార్థులకు విద్య సామాగ్రి అందించాలి
- చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్
విశ్వంభర, చౌటుప్పల్: చౌటుప్పల్మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన మోగదాల పావని రమేష్ గౌడ్ ను మున్సిపాలిటీ 14 వార్డు గణేష్ నగర్ కు చెందిన ప్రముఖ ఎన్జీఓ ఒరగంటి శీను, ఓరగంటి నరసింహ సోదరులు సన్మానించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపాలిటీ ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని తెలిపారు. చౌటుప్పల్ హై స్కూల్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు అందజేసిన ఒరగంటి శ్రీనును అభినందించారు. అనంతరం వరగంటి శ్రీను గౌడ్ మాట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపల్ నూతన చైర్మన్గా ఎన్నికైన పావని రమేష్ గౌడ్, నూతన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చెర్ పర్సన్ గా ఎన్నికైన పావని రమేష్ గౌడ్ సన్మాన కార్యక్రమానికి బొకేలు శాలువలు బదులు విద్యా సామాగ్రి అందించాలని పిలుపునిచ్చారు. పావని రమేష్ గౌడ్ ల పిలుపు మేరకు పరీక్ష విద్యా సామాగ్రి అందజేశానని చెప్పారు.



