డంపింగ్ యార్డు పరిశీలన
విశ్వంభర, మహబూబాబాద్ : మహబూబాబాద్ మునిసిపాలిటీ కి చెందిన డంపింగ్ యార్డును, పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను శనివారం (స్థానిక సంస్తల) అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో పరిశీలించారు. ఈ సందర్బంగా మునిసిపాలిటీ నుంచి ఎంత చెత్త సేకరణ జరుగుతోంది, ఎన్ని ట్రాక్టర్లు, ఆటోలు ఉన్నాయని అడిగారు. రోజుకు ఎన్ని మెట్రిక్ టన్నుల చెత్తను ట్రాక్టర్లు, ఆటోల ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో సేకరించిన చెత్తను యార్డులో వేరు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. అదేవిధంగా పట్టణంలోని కూరగాయల మార్కెట్, ఇతర ప్రాంతాలలో చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణ పనులను తనిఖీ చేసి, కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ ఎన్.రవీందర్, శానిటరీ ఇన్స్పెకర్ కర్ణాకర్, తోట రాజేష్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ క్రాంతీ తదితరులు పాల్గొన్నారు.



