మున్సిపల్ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలి: సీఐటీయూ

విశ్వంభర, మాదాపూర్: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సీఐటీయూ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు బి. నాగేశ్వరరావు మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్న సైబరాబాద్ మున్సిపల్ ప్రాంతం ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్నప్పటికీ, అమీన్పూర్, పటాన్చెరు, శేర్లింగంపల్లి సర్కిళ్ల పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రస్తుతం కార్మికులకు నెలకు రూ.16,600 మాత్రమే వేతనంగా చెల్లిస్తున్నారని, 2025 డిసెంబర్‌లో జీహెచ్‌ఎంసీలో విలీనమైనప్పటికీ అక్కడ అమలులో ఉన్న వేతనాలను సైబరాబాద్ మున్సిపల్ కార్మికులకు వర్తింపజేయడం లేదని ప్రశ్నించారు. ఏడు నెలలు గడిచినా పెంచిన వేతనాలను అమలు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.బొల్లారం, తెల్లాపూర్, రామచంద్రాపూర్, బీరంగూడ, ముత్తంగి, భారతి నగర్ డివిజన్లలో కలిపి సుమారు 1,500 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. కార్మికులకు ఇప్పటికీ యూనిఫాంలు అందజేయలేదని, ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి కనీస సౌకర్యాల విషయంలో కూడా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.జోనల్ కమిషనర్ దృష్టికి అనేకసార్లు సమస్యలను తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని, గత రెండు నెలలుగా వేతనాలను 25, 26 తేదీలలో చెల్లించడం కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రిషియన్ల విధుల విషయంలో కూడా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.వందల కోట్ల రూపాయల ఆదాయం ఉన్న సైబరాబాద్ మున్సిపల్ ప్రాంతంలో కార్మికులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపల్ కార్మికుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. విధి నిర్వహణలో ప్రమాదాలకు గురై మరణిస్తున్న కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని, పదవీ విరమణ అనంతరం ప్రతి కార్మికుడికి రూ.10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ అందించాలని డిమాండ్ చేశారు.కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ ధర్నాలో అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్లకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు కొంగరి కృష్ణతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.

🕒 10 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/citu-should-give-minimum-wage-of-rs-26-thousand-to/article-16374

Tags: