ప్రమాద బాధిత కుటుంబానికి అండగా కూతాటి విజయభాస్కర్
విశ్వంభర, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 1వ వార్డు కస్తూర్బా కాలనీకి చెందిన ఇటుక బట్టీ కార్మికుడు మంద సదానందం మూడు నెలల క్రితం జరిగిన బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి ఆయన కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, బీఆర్ఎస్ మాజీ ఏఎంసీ డైరెక్టర్ కూతాటి విజయభాస్కర్ అండగా నిలిచారు. గత మూడు నెలలుగా సదానందం కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ, వైద్య చికిత్స ఖర్చులను భరిస్తూ పెద్దన్నలా బాధ్యత తీసుకున్నారు. తాజాగా కుటుంబ అవసరాల కోసం సుమారు రూ.20 వేల విలువైన మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. నిరుపేద కుటుంబం కష్టకాలంలో అండగా నిలిచిన కూతాటి విజయభాస్కర్ సేవాభావాన్ని స్థానికులు, కాలనీ ప్రజలు అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు. కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.