క్షయవ్యాధి నిర్మూలనకు సమన్వయంతో పనిచేయాలి: డీఎంహెచ్‌ఓ డా. రవి రాథోడ్
విశ్వంభర, మహబూబాబాద్: జిల్లాలో క్షయవ్యాధి (టీబీ) నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బి. రవి రాథోడ్ సూచించారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో టీబీ సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. టీబీ పూర్తిగా నయం చేయగల వ్యాధి అని, లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకుని ఉచిత చికిత్సను పూర్తిగా తీసుకుంటే కోలుకోవచ్చని తెలిపారు. రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీ అనుమానితులను సకాలంలో గుర్తించడం, నిర్ధారణైన వారికి వెంటనే చికిత్స ప్రారంభించడం, చికిత్స పూర్తయ్యేలా పర్యవేక్షించడం, ఇంటింటి సర్వేలు, కాంటాక్ట్ ట్రేసింగ్, నిక్షయ్ పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రులు గుర్తించిన టీబీ కేసులను కూడా తప్పనిసరిగా నిక్షయ్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా టీబీ అధికారి డా. అర్జున్‌తో పాటు టీబీ సిబ్బంది పాల్గొన్నారు.