విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ

విశ్వంభర, చింతపల్లి: మండలంలోని నసర్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ ను గ్రామ సర్పంచ్ పంబలి మాలతి వెంకటయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు గురువారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ పంబలి మాలతి వెంకటయ్య విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించడం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న నాణ్యతతో కూడిన ఉచిత విద్యను గ్రామంలో ఉన్న తల్లిదండ్రులు వారికి అందేలా చూడాలన్నారు. తల్లిదండ్రులు బాగా ఆలోచించి మన పాఠశాలను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని కోరారు. మన గ్రామంలో ఉన్న పిల్లలందరినీ మన ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేసి పాఠశాల బలోపేతానికి సహకారం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులను వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పున్ రెడ్డి సుమతి, ఉప సర్పంచ్ వడ్లకొండ నర్సింహా, వార్డు సభ్యులు రాశిక శివకృష్ణ, కర్నాటి నాగార్జున, గడిగంటి సంధ్య పాపారావు, బొడ్డుపల్లి పరమేష్, నల్ల అనురాధ, వెంకటయ్య, ప్రధానోపాధ్యాయులు కోరెక్క రేవతి, ఉపాధ్యాయులు పుష్పరాణి, ఝాన్సీ, వలబోతు ఆదినారాయణ, షేక్ నజీర్, బీరెల్లి మహేష్, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

🕒 03 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-text-books-and-note-books-to-students/article-17782

Tags: