ఘనంగా హాజ్రత్ సయ్యద్ హుస్సేన్ పటేల్ దర్గా జాతర
విశ్వంభర,వికారాబాద్: మర్పల్లి మండల కేంద్రంలోని హజ్రత్ సయ్యద్ హుస్సేన్ పటేల్ దర్గా జాతర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డా. ఏ. చంద్రప్రియ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఆమెకు దర్గా కమిటీ స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మత సామరస్యం, ఐక్యతను చాటే ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరం అని అన్నారు. కమిటీ సభ్యులు డా. చంద్రప్రియను శాలువాతో సత్కరించారు. ఈ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు సీనియర్ సభ్యులు చంద్రన్న, ఇస్మాయిల్ భాయ్, సర్వేశ్, మల్లేష్ యాదవ్, మధుసూదన్ రెడ్డి, వడ్ల వెంకటి, పంతులు భాయి, శ్రీనివాస్, అమిత్ భాయ్, ఖయ్యూం, మూజిక్, జావిద్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.