గార్ల మండలంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
- కె.జి.బి.వి, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని, తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ స్నేహ శబరిష్
విశ్వంభర, మహబూబాబాద్: గురువారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ గార్ల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి వసతులు, బోధన, విద్యార్థినుల సంక్షేమంపై సమీక్షించారు. కలెక్టర్ తరగతి గదులను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి వారి చదువు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వంటశాల, భోజనశాల, వసతి గృహాలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాన్ని స్వయంగా పరిశీలించారు. గార్ల మండల కె.జి.బి.వి ప్రత్యేక అధికారి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధులలో నిర్లక్ష్యం గా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు తరగతి వసతుల కోసం నిర్మాణాన్ని పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులతో పనులు వేగవంతంగా పూర్తిచేయాలని అన్నారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, నాణ్యతలో రాజీ పడవద్దని తెలిపారు. హాస్టల్, టాయిలెట్స్, కిచెన్ పరిసరాలను ప్రతిరోజూ శుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థుల డార్మిటరీ లను పరిశీలించి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.ప్రతి నెల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రికార్డులు మెయింటైన్ చేయాలని అన్నారు. ఉపాధ్యాయులు సిలబస్‌ను సమయానికి పూర్తి చేసి, వెనుకబడిన విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. సరైన టీచింగ్ ప్లాన్ తో విద్యార్థులకు ఉత్తమ భోధన అందించాలని అన్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠ్యoశాలను వివరంగా అర్ధమయ్యే పద్దతిలో పాఠాలు భోదించాలని, ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించే విధంగా ప్రతి అంశాన్ని వివరంగా వివరించాలన్నారు. నిర్లక్ష్యంగా బోధించే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.తరగతి గదుల్లో ఉపాధ్యాయుల బోధనా తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో కలెక్టర్ పాఠాలు చదివి వినపించమన్నారు. వాటి యొక్క అర్థాలను తెలుయకపోతే అట్టి అంశాలపై కలెక్టర్ స్వయంగా వివరించారు. విద్యార్థుల ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని పరిశీలించారు. "బాలికల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకూడదు. వారికి సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడం మన బాధ్యత" అని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. వారి ఉన్నత చదువుల లక్ష్యాల గురించి అడిగి తెలుసుకుని ప్రోత్సహించారు. అనంతరం కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఇన్ పేషంట్, ఔట్ పేషంట్ వివరాలను, పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో స్పెషలిస్ట్ వైద్యుల వివరాలు తెలుసుకున్నారు. పేషంట్ లకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి పరిశుభ్రమమైన ఆహారాన్ని అందించాలని అన్నారు. ఆసుపత్రి వార్డులను పరిశీలించి పేషెంట్ లకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. పేషెంట్ ల తొ మాట్లాడి వారి వివరాలను, వారికి ఆసుపత్రిలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ లతో మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వైద్య సదుపాయాలు అందించాలని అన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రజాలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి సిబ్బంది విధుల నిర్వహణ పై, పెండింగ్ ఫైళ్ల వివరాల నివేదికలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది వారు కేటాయించిన విధులను సక్రమంగా, పూర్తి పారదర్శకంగా, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అన్నారు. సర్ ఫారాల పంపిణీ ప్రక్రియ ఎంతవరకు కొనసాగుతుందని అందుకు సంబంధించిన నివేదికలను అడిగారు. కంప్యూటర్ లో ఆన్ లైన్, ఆఫ్ లైన్ వివరాల నమోదును అడిగి తెలుసుకున్నారు. సాదాబైనామా, భూ భారతి పెండింగ్ ఫైళ్ల వివరాలను తెలుసుకున్నారు. ఈ తనిఖీలో డి.ఈ.ఓ సత్యనారాయణ, ఎంఈఓ వీరభద్రరావు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ గాయత్రి, వార్డెన్, ఎం.ఆర్.ఓ శారద, ఎం.పి డి.ఓ, ఆసుపత్రి వైద్యులు డాక్టర్ బాలు నాయక్ డాక్టర్ సతీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.