మత్తు మహమ్మారిని చిత్తు చేయాలి
- -డీజీపీ సీవి ఆనంద్ ని కలిసి వినతి పత్రం అందజేసిన బూడిద రాంరెడ్డి
విశ్వంభర, ఇబ్రహీంపట్నం: నేటి బాలలే రేపటి పౌరులు, నేటి యువతకు రేపటి భవిష్యత్తు పై అవగాహన లేకపోతే ఈ సమాజాన్ని కాపాడే వారు లేరని చెడు వ్యసనాలకు బానిసగా మారిన యువతను కాపాడడానికి కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రాంరెడ్డి తెలంగాణ డీజీపీ సీవి ఆనంద్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. డ్రగ్స్, గంజాయి యువత దరి చేరకుండా ప్రత్యేక ఆపరేషన్ లు చేపట్టాలని తెలిపారు. రోడ్లపైన 24 గంటలు గంజాయి సప్లయ్ చేసే ముఠాలను పట్టుకోవడానికి రెక్కీ నిర్వహించే టీమ్ లను ఏర్పాటు చేయాలని తెలిపారు. అదే రకంగా ఆన్లైన్ బెట్టింగ్, గేమ్స్ కి బానిసలుగా మారి కోట్లలో అప్పు చేసే యువతి యువకులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి వారి జీవితాలలో వెలుగులు నింపాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పై డీజీపీ సీవి ఆనంద్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.