సీనియర్ అసిస్టెంట్ కు  పదోన్నతి

సీనియర్ అసిస్టెంట్ కు  పదోన్నతి

 విశ్వంభర, భద్రాచలం: దక్షిణ భారతదేశంలో విశిష్టమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో పరిపాలనా విభాగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రెడ్డికి సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పిస్తూ దేవస్థానం కార్యనిర్వాహక అధికారి (ఈవో) దామోదర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దేవస్థానం పరిపాలనా వ్యవహారాల్లో నిష్పాక్షికత, క్రమశిక్షణ, బాధ్యతా నిబద్ధతతో సేవలందిస్తున్న శ్రీనివాస్ రెడ్డి, తన విధి నిర్వహణలో ప్రతిభ, కార్యదీక్షతో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయనకు లభించిన ఈ పదోన్నతి దేవస్థానం సిబ్బందిలో సంతోషాన్ని నింపింది.

Tags: