ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

విశ్వంభర, జనగాం: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ దేవరుప్పుల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్‌తో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పేపర్ లీక్‌కు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులపై పోలీసుల చర్యలను ఖండించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/dharmendra-pradhan-should-resign-mla-yashaswini-reddy/article-19532

Tags: