కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం
- రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య
విశ్వంభర, షాద్ నగర్ : వార్డుల వారీగా అభివృద్ధి చేసి పట్టణాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దే శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. షాద్ నగర్ పట్టణంలో 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అందెమోహన్ తరపున ఆయన ప్రచారానికి వచ్చారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున అక్కడికి జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అందెమోహన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. గతంలోనైనా, వర్తమానంలోనైనా గ్రామీణ ప్రాంతాలను, పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని పేర్కొన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో పలు సమస్యలు ఏర్పడ్డాయని, కాంగ్రెస్ పార్టీ క్రమంగా పరిస్థితిని చక్కదిద్దుతూ వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అన్ని వార్డులలో ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.



