కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో వంతెన ఏర్పాటు
On
విశ్వంభర: జిహెచ్ఎంసి : శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానములోని కోనేరులో ఏర్పాటు చేసిన శ్రీ ధ్యానాంజనేయ స్వామి విగ్రహానికి చేరుకోవడానికి దాత సహకారముతో నిర్మించిన వంతెనను దాత, తెలంగాణ స్పోర్ట్స్ కార్పోరేషన్ చైర్మన్ కే. శివసేనా రెడ్డి, హర్షశ్రీ ధంపతులచే మంగళవారం పూజలు నిర్వహించి దేవస్థానమునకు అప్పగించారు. ఈ సందర్బంగా చైర్మన్ మట్లాడుతూ , ఈ వారధి నిర్మణం భక్తులకు సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతొ చేపట్టామని తెలిపారు. కోనేరులో ఉన్న శ్రీ ధ్యానాంజనేయ స్వామి దర్శనం సులభంగా అందరికీ అందాలని భావించామని చెప్పారు. ధేవుడి సేవ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నమని అన్నారు. భవష్యత్తులో కుడా దేవస్తానం అభివృద్దికి తమ సహకారం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.హర్షశ్రీ గారు మట్లాడుతు ఈ సేవలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని తెలిపారు. భక్తులకు సౌకర్యం కలిగించే పనులు చేయడం నీజమైన పుణ్యమని చప్పిరు. ఈ వంతెన ద్వారా మరింత మంది భక్తులు స్వామి దర్శనం పొందగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.అదే విధంగా శ్రీ లక్ష్మీ శారీ మందిర్ యజమాని శ్రీ వీరమల్ల సురేష్ గుప్తా రోజా దంపతులు డైరీలు అలయ కార్యనిర్వహణాధికారి, చైర్మన్ మరియు ధర్మకర్తల సమక్షములో స్వామి వారికి సమర్పించినారు.ఈ సందర్భంగా దాతలకు ఆలయము తరపున ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులచే ఆశీర్వచనము, తీర్థ ప్రసాదములు అందించడం జరిగింది. కార్యక్రమములో ఆలయ కార్యనిర్వహణాధికారి యన్. లావణ్య, చైర్మన్ ఈదులకంటి సత్యనారాయణ రెడ్డి, ధర్మకర్తలు దిండు ప్రవీణ్ గౌడ్, తోకటి కిరణ్ కుమార్, నారాయణ్ దుర్గా రెడ్డి, బండిగారి శ్రీనివాస్ గౌడ్, యం. రాజేశ్వరి పాల్గొన్నారు.



