ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలి.
- -జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా:- ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు. శాఖల వారీగా అందిన ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరిస్తూ నివేదిక సమర్పించాలి. సోమవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, సంబంధిత అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం, ఇతర వేదికల ద్వారా ప్రజల సమస్య పరిష్కారం నిమిత్తం సామాన్య ప్రజలు చేసుకున్న ప్రతి ఒక దరఖాస్తుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ తక్షణమే పరిష్కరించి నివేదికను తమకు సమర్పించాలని, తమ పరిధిలో లేని పక్షంలో సంబంధిత విభాగానికి సిఫారసు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు,ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం తో పాటు
తొర్రూరు రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం, మహబూబాబాద్ రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాలలో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అట్టి దరఖాస్తుల పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు, హైదరాబాద్ నుండి వచ్చిన ప్రజావాణి ప్రాజెక్ట్ డైరెక్టర్ రాకేష్ మహబూబాబాద్ జిల్లాలో అమలు చేస్తున్న ప్రజావాణి ప్రక్రియ యాప్ విధానాన్ని కలెక్టర్ స్నేహ శబరిష్ ను అడిగి తెలుసుకుని స్వయంగా పరిశీలించారు.