రక్తదానంతో ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడవచ్చు: డీసీపీ అనురాధ.
విశ్వంభర, చైతన్యపురి:- రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడవచ్చు అని ఎల్బీనగర్ జోన్ డీసీపీ అనురాధ అన్నారు. పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవాలలో భాగంగా శుక్రవారం ఎల్బీనగర్ డివిజన్లోని చైతన్యపురి, సరూర్ నగర్, ఎల్బీనగర్,నాగోల్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీసుల ఆధ్వర్యంలో చైతన్యపురిలో మిత్ర బ్లడ్ డొనేషన్ సెంటర్ సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా డిసిపి అనురాధ మాట్లాడుతూ కొంతమంది రక్త దానం చేయడం వల్ల బలహీనపడతారని అపోహ ఉంటుందని, ఎంత మాత్రం నిజం కాదని అన్నారు. రక్తం దానం చేయడంవల్లనే ఆరోగ్యం గా ఉంటారని అన్నారు. యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని సూచించారు. శిబిరంలో 50 మంది రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారిని డీసీపీ అభినందించారు.ఈకార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు, ఏసిపి కృష్ణయ్య, సిఐలు కే. సైదులు, వి. సైదిరెడ్డి, కే. వినోద్ కుమార్, మక్బూల్ జానీ ఎస్సెలు సిబ్బంది పాల్గొన్నారు.



