ఎంఈఓ కార్యాలయం ముట్టడి.. 

ఎంఈఓ కార్యాలయం ముట్టడి.. 

  • ఆచూకీ తెలపాలని పోలీసులకు వినతి

విశ్వంభర, చౌటుప్పల్: మండల విద్యాధికారి (ఎంఈఓ) కార్యాలయాన్ని అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ముట్టడించి నిరసన తెలిపారు. విద్యార్థుల సమస్యలు, ప్రైవేట్ పాఠశాలల అక్రమాలు, ప్రభుత్వ నిబంధనల అమలుపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎంఈఓ స్పందించడం లేదని, కార్యాలయ సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ఆరోపించారు. నిరసనలో భాగంగా ఎంఈఓ కుర్చీని కార్యాలయం బయటకు తీసుకొచ్చి, "ఎంఈఓ ఎక్కడ?", "ప్రజలకు అందుబాటులో లేని అధికారి" అనే సందేశాలతో వినూత్నంగా ఆందోళన చేపట్టారు. అనంతరం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో సీఐకి వినతిపత్రం అందజేసి, విధులకు గైర్హాజరవుతున్న ఎంఈఓ ఆచూకీ గుర్తించి తెలియజేయాలని కోరారు. ప్రజలకు అందుబాటులో లేని అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

🕒 03 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/meo-office-besieged/article-17714

Tags: