డ్రగ్స్, గంజాయిపై నిఘా అవసరం: అవినాశ్ మహంతి
విశ్వంభర, హైదరాబాదు : డ్రగ్స్, గంజాయి, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అక్రమ రవాణాపై మరింత సమర్థంగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని డీసీఏ డైరెక్టర్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అవినాశ్ మహంతి అన్నారు. హైదరాబాదులోని డీసీఏ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో దాడులు, తనిఖీల్లో ప్రతిభ కనబరిచిన ఎస్టీఎఫ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎక్సైజ్ బృందాలు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కెమికల్ పరిశ్రమలు, ఔషధ కంపెనీలు, మెడికల్ దుకాణాలపై సంయుక్త తనిఖీలను మరింత విస్తృతంగా నిర్వహించాలని, అక్రమ రవాణాను అరికట్టడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో: డీసీఏ జాయింట్ డైరెక్టర్ జి. రామ్‌ధన్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ ఆంజన్‌రావు పాల్గొన్నారు.