పెట్రో ధరలు తగ్గంచాలి:  సీపీఎం

పెట్రో ధరలు తగ్గంచాలి:  సీపీఎం

విశ్వంభర, కేసముద్రం: పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని కేసముద్రం, అంబేద్కర్ సెంటర్లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆటోను తాళ్లు కట్టి లాగుతూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి గోడిశాల వెంకన్న మాట్లాడుతూ, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు, ప్రతి నెల  పెంచడం వల్ల,  జీవనోపాధి కోసం ఆటోలు నడుపుతున్న కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు.  అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ వినియోగదారులకు ధరలు తగ్గించ లేదు.  క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయని పొదుపుసూత్రాలుచెబుతూన్నారు.  పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగడం వల్ల నిత్యవసర సరుకులుధరలుపెరుగుతాయని, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ఆయిల్ కంపెనీల లాభం కోసం ప్రజా వ్యతిరేకవిధానాలు మానుకొని ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు బొబ్బల యాకుబ్ రెడ్డి,చాగంటి కిషన్, నీరుటి జలంధర్, జల్లే జయరాజ్, సోమరపు ఎల్లయ్య, ఎండి యాకుబ్ పాషా, ఆటో కార్మికులు బెజ్జం నాగరాజు, ఎండి రబ్బాని, యాకన్న, పాషా తదితరులు పాల్గొన్నారు.

🕒 19 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/petrol-prices-should-be-reduced-by-cpm/article-15371

Tags: