టిబి వ్యాధి పై ప్రజల్లో అవగాహన కల్పించాలి
విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఎస్‌టీఎల్‌ఎస్‌లు (ఎస్ టి ఎల్ ఎస్) టిబి సూపర్వైజర్లతో జిల్లా స్థాయి టిబి సమీక్ష సమావేశం జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి రాథోడ్ మాట్లాడుతూ, జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలన లక్ష్య సాధనకు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. టిబి అనుమానితులను త్వరితగతిన గుర్తించి పరీక్షలు నిర్వహించడం, నిర్ధారిత రోగులకు పూర్తి స్థాయిలో చికిత్స అందించడం, చికిత్స మధ్యలో మానివేయకుండా పర్యవేక్షణ చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. అదేవిధంగా నిక్షయ్ పోర్టల్‌లో వివరాలను సకాలంలో నమోదు చేయాలని ఆదేశించారు. టిబి నియంత్రణ కార్యక్రమాల అమలు, లక్ష్యాలు పనితీరుపై సమీక్ష నిర్వహించారు. టిబి వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సమావేశంలో డాక్టర్ అర్జున్, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, అశోక్ టిబి సిబ్బంది, ఎస్‌టీఎల్‌ఎస్‌లు, టిబి సూపర్వైజర్లు, ఇతర ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.