పోలీసు సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం
లివర్ ఫైబ్రోస్కాన్, ఆరోగ్య, ఆహార నియమాల పట్ల అవగాహన సదస్సు- కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ నరసింహ
విశ్వంభర, సూర్యాపేట: పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా ఎస్పి నరసింహ అధ్వర్యంలో సూర్యాపేట జిల్లా పోలీసు శాఖ, పట్టణంలోని ప్రముఖ డివైన్ టచ్ హాస్పటల్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా పోలీసులకు ఉచిత లివర్ సంబంధ, రక్త సంబంధ వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పోలీసు సిబ్బందికి అత్యంత ఖరీదైన లివర్ ఫైబ్రోస్కాన్ పరీక్షలను ఉచితంగా చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నరసింహ, అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డివైన్ టచ్ హాస్పటల్ డాక్టర్ విజయ మోహన్, సంధ్య మోహన్ మరియు డీఎస్పీలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సదుపాయాన్ని 200 మంది పోలీసు సిబ్బంది సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.. నిత్యం ప్రజా రక్షణలో అనుక్షణం పని చేస్తూ బిజిగా ఉంటూ పోలీసు సిబ్బంది తమ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారని అన్నారు. పోలీసు సిబ్బంది మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజలకు మరింత వేగంగా, సమర్థవంతంగా పోలీసు సేవలు అందించగలరని ఆయన పేర్కొన్నారు. సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమం కోసం అనుక్షణం కృషి చేస్తానని, అందులో భాగంగానే అత్యంత ఖరీదైన లివర్ ఫైబ్రోస్కాన్ పరీక్షలను ఉచితంగా చేయిస్తున్నట్లు తెలిపారు. మానవ శరీరంలో లివర్ అత్యంత ముఖ్యమైన అవయవమని, మంచి ఆహార అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం మన అందరి బాధ్యత అని ఎస్పీ స్పష్టం చేశారు. లివర్ అనేది మానవ శరీరం అత్యంత ముఖ్యమైన అవవయవం అన్నారు. మంచి ఆహార అలవాట్లతో లివర్ ఆరోగ్యంగా ఉంటుంది అన్నారు. సిబ్బంది సమయస్ఫూర్తితో విధులు నిర్వర్తించి ప్రజలకు పోలీసు సేవలు అందించాలని కోరారు. వత్తిడి లేకుండా పని చేయాలని సూచించారు. ఉద్యోగం తో పాటుగా కుటుంబ సభ్యులతో గడపడం ముఖ్యం అన్నారు. ఎల్లప్పుడూ వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఉత్సాహంగా ఉంటాం అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తాం అని తెలిపారు. పోలీసుల కోసం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చిన డివైన్ టచ్ హాస్పటల్ యాజమాన్యానికి, డాక్టర్ విజయ మోహన్, సంధ్య మోహన్ బృందానికి ఎస్పీ పోలీసు శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలిపారు.
అనంతరం డివైన్ టచ్ హాస్పటల్ డాక్టర్ విజయ మోహన్ పోలీసు సిబ్బందికి ఆరోగ్యకరమైన జీవన విధానం, పాటించాల్సిన ఆహార నియమాలపై అవగాహన కల్పించారు. మానవ శరీరంలో లివర్ పనితీరు, లివర్ వ్యాధులు వచ్చే సంకేతాలు, వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరసింహ చారి, డాక్టర్ విజయ మోహన్, సంధ్య మోహన్, సీఐ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, జానయ్య, ఆర్ఎస్ఐలు సురేష్, సాయిరాం, కె. అశోక్, ఎం. అశోక్, రాజశేఖర్, అన్వర్, ఎస్ఐలు సందీప్, గోపి, అజయ్ మరియు పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు.