విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి

  • జూలై 31న రాష్ట్రవ్యాప్తంగా తరగతుల బహిష్కరణ, కలెక్టరేట్ల ముట్టడి: ఎంపీ ఆర్. కృష్ణయ్య

విశ్వంభర, విద్యానగర్ :  విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. 14 లక్షల మంది విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, పాత విధానంలోనే పథకాన్ని కొనసాగించాలి. లేనిపక్షంలో జూలై 31న రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు తరగతులను బహిష్కరించి కలెక్టరేట్లు, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాలను ముట్టడిస్తారని ఎంపీ ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. హైదరాబాదు విద్యానగర్ బీసీ భవన్‌లో ఆదివారం  నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లకు బడ్జెట్ లేదని ప్రభుత్వం చెప్పడం సమంజసం కాదన్నారు. ఈ పథకం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం పొందారని, దానిని బలహీనపరిచే చర్యలు మానుకోవాలని కోరారు.
ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో అనేక ప్రైవేట్ డిగ్రీ, జూనియర్ కళాశాలలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అధ్యాపకులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. కొన్ని కళాశాలలు మూతపడినట్లు పేర్కొన్నారు. ఫీజులు నేరుగా కళాశాలలకు చెల్లించే పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి విద్యావేత్తలు, బీసీ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే విద్యార్థి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం  వెంకటేష్, రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, రాష్ట్ర బీసీ కులాల వేదిక అధ్యక్షుడు జి. అనంతయ్య, రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు రాజేందర్, రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ పర్లగోర్ల మోడీ రాందేవ్, బలరాం తదితరులు పాల్గొన్నారు.

🕒 27 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/student-fee-arrears-should-be-released-immediately/article-19836

Tags: