కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
- కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించిన ఎమ్మెల్యే నాగరాజు
విశ్వంభర, హనుమకొండ: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు,10వ వార్డులకు చెందిన బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు గురువారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు అకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన కొనసాగుతోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల ఫలితంగా ప్రజలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన తెలిపారు.పార్టీలో చేరిన ప్రతి నాయకుడికి కాంగ్రెస్ కుటుంబం తరుపున స్వాగతం పలుకుతూ, ప్రజా సేవలో అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్,వర్ధన్నపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి నిమ్మని శేఖర్ రావు,మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి,వైస్ చైర్మన్ నేతావాత్ శిభారాణి- రాజేందర్,పట్టణ అధ్యక్షులు మైస సురేష్,పట్టణ నాయకులు ఈగ దామోదర్,కౌన్సిలర్లు పాపారావు,దేవేందర్,కమ్లి-కీమా నాయక్,వాణి కుమారస్వామి,జెబిఎం హన్మకొండ జిల్లా చైర్మెన్ రుగ్వేద్ రెడ్డి,సీనియర్ నాయకులు పోశాల వెంకటేశ్వర్లు,నాంపల్లి యాదగిరి,మహమ్మద్ అప్సర,అన్వర్,కొండేటి సాంబయ్య, మాజీ కౌన్సిలర్ సుధీర్, నియోజకవర్గ,మున్సిపాలిటీ,మండల,గ్రామ స్థాయి ముఖ్య నాయకు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.