పేదవాడి సొంతింటి కల నెరవేర్చడం ప్రభుత్వ లక్ష్యం.
- -ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ రెడ్డి.
విశ్వంభర, పెద్ద శంకరంపేట :- పేదల సొంతింటి కల నెరవేర్చడమే ఈ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ రెడ్డి అన్నారు. ప్రజాపాలనలో లబ్ధిదారులు గృహప్రవేశాలు ఎంతో ఆర్భాటంగా చేసుకుంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశా వేడుకల్లో పాల్గొన్నారు. పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులు పిట్ల లావణ్య-నాగయ్య దంపతుల నూతన గృహ ప్రవేశ మహోత్సవంలో ఆయన పాల్గొని, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, గ్రామ సర్పంచ్ సంజీవులు,ఉప సర్పంచ్ నర్సింలు,భూమయ్య సర్పంచ్, శివరాజ్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు,క్రిష్ణ ముదిరాజ్,స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు