కంచర్లగూడెంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కంచర్లగూడెంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ ఓటరు జాబితా సవరణ డిజిటలైజేషన్ ప్రక్రియ, గ్రామకంఠం–ఆబాది రీ సర్వే, ఎస్‌జీటీ ఉపాధ్యాయుల శిక్షణ తరగతులు, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్‌ఐఆర్ ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పూర్తిగా పారదర్శకంగా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తున్నామని, వాటిని సక్రమంగా నింపి సమర్పిస్తే డిజిటలైజేషన్ ద్వారా ఓటు వివరాలు నిర్ధారించబడతాయని చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తూ ఎలాంటి పొరపాట్లు లేని ఓటరు జాబితా సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఎంపికైన 70 గ్రామాల్లో 11 గ్రామాల్లో గ్రామకంఠం, ఆబాది రీ సర్వే పూర్తయిందని, మిగిలిన ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్‌జీటీ ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్, విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ పర్యటనలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. సత్యనారాయణమూర్తి, డీఎస్ఓ అప్పారావు, ఎంఈఓ బాలాజీ, తహసీల్దార్ విజయ, ఎంపీడీవో వీరబాబు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.