ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి
- జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
విశ్వంభర, మహబూబాబాద్: సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో, రెవెన్యూ అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.అనిల్ కుమార్, అన్ని విభాగాల జిల్లా అధికారులు, తొర్రూరు, మహబూబాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారులు గణేష్, క్రిష్ణవేణి లతో కలిసి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన దరఖాస్తుదారులతో కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులు తీసుకొని వారి వినతులను సవివరంగా విని సంబంధిత విభాగాల అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో పనిచేస్తున్న అన్ని విభాగాల జిల్లా అధికారులు ప్రతి సోమావారం నిర్వహించే ప్రజావాణి కి తప్పక హాజరు కావాలని లేనిచో శాఖాపరమైన చర్యలను ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ఈ సందర్భంగా కురవి మండలం కంచెర్ల గూడెం గ్రామానికి చెందిన బి. కవిత తన భర్త అనారోగ్యం కారణంగా చనిపోయాడని ఆర్థికంగా ఇబ్బంది ఉందని వితంతు పెన్షన్ ఇప్పించి ఆదుకోవాలని కోరారు. గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు తమ గ్రామంలో 90 శాతం మంది రైతులు వ్యవసాయం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, తమ గ్రామ క్లస్టర్ లో రైతులు 70 శాతానికి పైగా మొక్కజొన్న పంట పండించారని తాము ఉన్న ప్రాంతానికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం చాలా దూరంగా ఉందని మా గ్రామం నందు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మంజూరు చేయాలని కోరారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి లో వచ్చిన 195 దరఖాస్తులను సంబందిత శాఖల అధికారులకు సత్వర పరిష్కారానికి ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో డి.ఆర్.డి.ఓ మధుసూదనరాజు, జడ్పీ సీఈవో పురుషోత్తం,డి.పి.ఓ హరిప్రసాద్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి. రవి రాథోడ్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి దేశీరాం, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీమన్నారాయణ, ఎస్సీ కార్పొరేషన్ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కిరణ్ కుమార్, జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారి కిరణ్ కుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్ యాదగిరి, డి వై.ఎస్.ఓ జ్యోతి, డి.ఈ.ఓ రాజేశ్వర్, డి.డబ్ల్యూ ఓ సబిత, మెప్మా పి.డి విజయ, హౌసింగ్ అధికారి భీమ్ల, ఎస్.ఈ ఏన్. పి.డి.సి.ఎల్ విజేందర్ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ అధికారి ధర్మేందర్, జిల్లా ఉపాధి అధికారి రజిత, పరిపాలన అధికారి పవన్ కుమార్, భూభారతి జిల్లా కో.ఆర్డినేటర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.



