రహదారి విస్తరణ పనులు వేగవంతం
On
విశ్వంభర, బోడుప్పల్: మల్కాజ్గిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ లోని బోడుప్పల్ టూ చిల్కానగర్ ప్రధాన రహదారి విస్తరణ పనులు, కల్వర్టు పనులను మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ భూక్య సుమన్, సీనియర్ నాయకులు గుర్రాల వెంకటేశ్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ అజయ్ యాదవ్ మాట్లాడుతూ, రోడ్డు విస్తరణ పనులకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను జరుపుటకు అధికారులు అంగీకరించినందున, ఇకపై రోడ్డు విస్తరణ పనులను వేగంగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. అలాగే కల్వర్టు పనులు పూర్తయినందున త్వరలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఎలిగొండయ్య, సునిల్ , కాలనీ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.



