హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి  

హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి  

  •  ఓసి, రైతు ప్రజాసంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

విశ్వంభర, బషీర్ బాగ్: అన్నదాతలకు, విద్యార్థులకు, వివిధ కుల సంఘాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడాలని ఓసి, రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రథాన కార్యదర్శి సంది తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 70 శాతం మిగిలి ఉన్న రెండులక్షల రుణ మాఫీకి నిధుల కేటాయింపు చేయలేదని, బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నిడుదల కేటాయింపులు తగ్గించిన ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చిన హామీల ఊసే లేదని , అన్ని రకాల పంటలకు 500 రూ బోనస్ ఇవ్వకుండా కేవలం సన్న రకాలకు అడపా దడపా అర కోరగా ఇస్తూ మోసాగించిందన్నారు. ఇప్పటికే రెండుసార్లు రైతు భరోసా నిధులను ఎగ్గొట్టిన ప్రభుత్వం నామ మాత్రంగానే విడుదల చేసి రైతులను దేహీ అనే విధంగా హీనంగా పరిగణించే సర్కార్ కు రైతన్నల ఉసురు తగలక తప్పదని హెచ్చరించారు. నామ మాత్రంగానే ఓసి రెడ్డి కార్పొరేషన్ లను ప్రకటించిన ప్రభుత్వం పాలక మండళ్లు ఏర్పాటు చేయలేదని బడ్జెట్తో లో నిడుదల కేటాయించక రెడ్డి ఓసి లను మోసగించిందన్నారు . ఈ నేపథ్యంలో అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అన్నీ వర్గాల కుల సంఘాల  సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 28 న ఓసి జేఏసీ రైతు ప్రజాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో లక్షలాది మంది తో రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభను న భూ తో న భవిష్యత్ తరహా లో నిర్వహిఇస్తున్నామని పార్టీల కతీతంగా అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానిస్తున్నామని శరవేగంగా సన్నాహక ఏర్పాట్లు జరుగుతున్నాయని పోలాడి రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓసి జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉత్తర తెలంగాణ జిల్లాల అధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఏనుగు చొక్కా రెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మహంకాళి రాజన్న,రెడ్డి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బండ గోపాల్ రెడ్డి, యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ , వైశ్య సంఘాల జేఏసీ చైర్మన్ చకీలం రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: