ప్యాడ్ బ్యాండ్‌కు అనుమతి ఇవ్వాలి : నాగరాజు

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: బోనాల పండుగ సందర్భంగా ప్యాడ్ బ్యాండ్‌కు రెండు బాక్సులతో కూడిన వాహనాలకు అనుమతి ఇవ్వాలి. బ్యాండ్ కళాకారుల ఉపాధికి భంగం కలగకుండా పోలీసులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని తెలంగాణ బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గుమ్మడిరాజు నాగరాజు కోరారు. తెలంగాణ బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం హైదరాబాదు నగర కమిటీ సమావేశం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అశ్వాల హనుమంతు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ బోనాల పండుగలో ప్యాడ్ బ్యాండ్ వాహనాలకు అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ, సెంట్రల్ జోన్ సీపీలను కోరగా వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. నగరంలోని వివిధ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో బ్యాండ్ కళాకారుల వాహనాలను సీజ్ చేయకుండా ఉపాధిని కాపాడాలని కోరారు. పోలీసులు సూచించిన మేరకు ధ్వని పరిమితులను పాటించేందుకు తాము సహకరిస్తామని చెప్పారు. అయితే రాత్రి 10 గంటల తర్వాత నిబంధనలు ఉల్లంఘించే కార్యక్రమాల విషయంలో నిర్వాహకులు, వినియోగదారులనూ బాధ్యులను చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి వేముల శ్రీనివాస్, నాగేష్, ప్రవీణ్, అనిల్, దేవేందర్, హుస్సేన్, మురళి, నరసింహ, బాబు తదితరులు పాల్గొన్నారు

🕒 27 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/nagaraju-should-give-permission-to-pad-band/article-19793

Tags: