మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇవ్వాలి
విశ్వంభర, హిమాయత్ నగర్: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జెన్-జీ యువతతో కలిసి సంబరాలు నిర్వహించారు. పేపర్ లీకేజీల కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు హైదరాబాదు లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజు మాట్లాడుతూ, పేపర్ లీకేజీల కారణంగా మరణించిన 21 మంది విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో: జెన్-జీ యువత ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.