సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వనమహోత్సవం
- ఏకకాలంలో 1500 మొక్కలు నాటిన పోలీసులు
- కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటిన జిల్లా కలక్టర్ తేజస్ నంద లాల్ పవార్, జిల్లా ఎస్పి నరసింహ
విశ్వంభర, సూర్యాపేట: పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలో భాగంగా సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో శనివారం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి ఏకకాలంలో జిల్లా పోలీసు సిబ్బంది 1500 మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై, మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో కార్యాలయ ప్రాంగణంలో ఏకకాలంలో సామూహికంగా 1500 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ.. చెట్లు, అడవులు పెంచడం వల్ల పర్యావరణ రక్షణకు, సమృద్ధిగా వర్షాలు కురవడానికి ఎంతగానో దోహదపడుతాయని పేర్కొన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, నాటిన ప్రతి ఒక్క మొక్కను మహా వృక్షంలా ఎదిగేలా బాధ్యతగా సంరక్షించాలని పిలుపునిచ్చారు. పోలీసులు అత్యంత ప్రాదాన్యమైన శాంతిభద్రతల విధులతో పాటు సామాజిక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం ఎల్-నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువగా నమోదు అవుతుందని నీటి ఎద్దడిని తట్టుకొని పండే పంటలవైపు రైతులు ఆలోచన చేయాలని అన్నారు. జిల్లా యంత్రాంగంలో పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖ అని పోలీస్ శాఖ ఇతర శాఖల సమన్వయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా పనిచేస్తుంది అని తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సామాజిక అంశాలపై అనేక ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి శాంతి భద్రతల రక్షణలో నిరంతరంగా కృషి చేస్తూన్నారు అన్నారు. జిల్లా పోలీస్ సిబ్బంది సంక్షేమానికి జిల్లా ఎస్పీ కృషి చేస్తున్నారని జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో పోలీస్ క్యాంటీన్, పరేడ్ గ్రౌండ్, జిమ్ లాంటి వసతులు ఏర్పాటు చేశారని, ఆహ్లాదకరమైన వాతావరణ కల్పన కోసం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు. జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఒకేసారి పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడం జరిగిందని వివరించారు. జిల్లా పోలీసు శాఖ అధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో పోలీస్ వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతున్నారు అన్నారు. శాంతి భద్రతల పరరక్షణలో నిరంతరం కృషి చేస్తున్నాము అని తెలిపినారు. చెట్లు పెంచడం అడవులు పెంచడం వల్ల వాతావరణ పరిస్థితులు అనుకూలించి మంచి వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. ఎల్ నినో ప్రభావం వల్ల తక్కువగా వర్షపాతం నమోదవుతుందని దీనికి అనుగుణంగా తక్కువ నీటితో పండే పంటలు రైతులు పండించాలని దీనిపై పోలీస్ శాఖ రైతులకు అవగాహన కల్పిస్తుంది తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి మంజు భార్గవి, డీఎస్పీలు ప్రసన్న కుమార్, రవి, నరసింహ చారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, డసఆర్బి ఇన్స్పెక్టర్ మగ్దూం అలీ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, జానయ్య, సిఐ లు రాజశేఖర్, వెంకటయ్య ఆర్ఎస్ఐలు సురేష్, ఎమ్. అశోక్, సాయిరాం, రాజశేఖర్, కె. అశోక్, అన్వర్, అఖిల్, ఎస్ఐ లు యాదవేందర్, మహేష్, మౌనిక, మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటారు