బీసీ బంద్ కు చేనేత ఐక్య వేదిక సంపూర్ణ మద్దతు. - రాపోలు వీరమోహన్

రాష్ట్ర వ్యాప్త బంద్ లో పాల్గొనాలని  ఐక్యవేదిక ప్రతినిధులకు పిలుపు. 

బీసీ బంద్ కు చేనేత ఐక్య వేదిక సంపూర్ణ మద్దతు. - రాపోలు వీరమోహన్

విశ్వంభర, హైదరాబాదు :- బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టబోయే బంద్ కు తెలంగాణ చేనేత ఐక్యవేదిక సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బీసీ ఉద్యమంలో భాగంగా శనివారం నాడు బంద్ నిర్వహించాలని బీసీ సంఘాల నేతలు నిర్ణయించారు. ఈ బంద్ కు తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ మద్దతు ప్రకటిస్తున్నామని మీడియా ప్రకటనలో తెలిపారు.   బంద్ కు అన్నీ వర్గాలు సహకరించాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత ఐక్య వేదిక జిల్లా, మండల సంఘాలు బీసీ బంద్ లో పాల్గొనాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బీసీ రిజర్వేషన్ ల అంశంపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి స్థానికంగా ఎప్పటికప్పుడు మద్దతు పలకాలని నిర్ణయించారు. బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ లో చేర్చి చట్టబద్దమైన రక్షణలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లకు లేని ఇబ్బందులు బీసీలకు ఎందుకు అని ప్రశ్నించారు. సామాజికంగా వెనుకబడ్డ బీసీ వర్గాల ప్రయోజనాల కోసం అన్నీ కులాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చేనేత ఐక్య వేదిక ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
 
 
 

Tags: