తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ నూతన ప్రెసిడెంట్ గా గురజాల రాధా రాణి. -  పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపిన క్యాట్కో 

తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ నూతన ప్రెసిడెంట్ గా గురజాల రాధా రాణి. -  పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపిన క్యాట్కో 

విశ్వంభర, హైదరాబాద్ :- తెలంగాణ రాష్ట్ర  వినియోగదారుల కమిషన్ ప్రెసిడెంట్ గా  నూతన బాధ్యతలు గురజాల రాధా రాణి చేపట్టారు. ఈ సందర్బంగా  క్యాట్కో ఆధ్వర్యంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వేముల గౌరీ శంకర్రావు, అధ్యక్షులు శంకర్ లాల్ చౌరస్తా, ప్రధాన కార్యదర్శి ఏలే వెంకటేశ్వర్లు, సభ్యులు వి రామ్మోహన్రావు అడ్వకేట్, కే వినోద్ కుమార్ విజయ్ అడ్వకేట్ పాల్గొని క్యాట్కో నిర్వహించిన కార్యక్రమాలు వివరించి డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల  దినోత్సవం సందర్భంగా సెమినార్, పాఠశాల విద్యార్థులకు కాంపిటీషన్ ప్రైజెస్ ఇవ్వడం జరిగిందని చేసిన పలు కార్యక్రమాలను వివరించారు. 

Tags: