రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం

రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం

విశ్వంభర, కేసముద్రం: ఢిల్లీలో విద్యార్థుల ముసుగులో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేసముద్రం మండల బీజేపీ ఆధ్వర్యంలో ఫులే సెంటర్‌లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శాంతిభద్రతలను కాపాడుతున్న పోలీసులపై దాడులు చేయడం హేయమైన చర్య అని ఖండించారు. విద్యార్థులను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం సరికాదని, హింసకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మండల అధ్యక్షుడు ఉప్పునుతల రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్, లెఫ్ట్, ఇతర విపక్షాల రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా, మండల బీజేపీ నాయకులు, వివిధ విభాగాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/burning-effigy-of-rahul-gandhi/article-19547

Tags: