పశుపోషణ, పాడి పరిశ్రమ పట్ల వివక్ష మానాలని డిమాండ్

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: కేంద్ర ప్రభుత్వం పశుపోషణ, పాడి పరిశ్రమ పట్ల వివక్ష చూపుతోందని, ఎన్‌ఎల్‌ఎం పథకం సరళతరం చేయాలని గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోచబోయిన శ్రీహరి యాదవ్ అన్నారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎన్‌ఎల్‌ఎం (నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్) అమలు తీరుపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోచబోయిన శ్రీహరి యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీంద్రనాథ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకానీ వెంకట్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యదర్శి అయిలబోయిన రమేష్ యాదవ్, గొర్రెలు–మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ యాదవ్, గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్‌ఎల్‌ఎం పథకంలో ఉన్న కఠిన నిబంధనల కారణంగా వృత్తి కులాలకు చెందిన గొర్రెల కాపరులకు ప్రయోజనం అందడం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు లక్ష్యం నెరవేరకపోవడంతో నిజమైన పశుపోషకులు పథకం నుంచి దూరమవుతున్నారని తెలిపారు. నిబంధనలు సవరించి యాదవులు, కురుమలకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. బ్యాంకులు ష్యూరిటీ లేకుండా రుణాలు మంజూరు చేసి సబ్సిడీలు అందించాలన్నారు. వృత్తి కులాల వారికి అవకాశాలు కల్పించకుండా అనర్హులుగా ప్రకటిస్తే న్యాయపోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. గొల్ల–కురుమలను రాజకీయ అవసరాలకే ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ఎన్‌ఎల్‌ఎం స్కీంలో షీప్ అండ్ గోట్ ప్రాజెక్టును వెంటనే పునఃప్రారంభించాలని, డీటీసీపీ అనుమతి లేకుండానే రుణాలు ఇవ్వాలని, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి మరో అవకాశం కల్పించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాదు పర్యటన సందర్భంగా ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అయోధ్య యాదవ్, కురుమూర్తి యాదవ్, ఆలేటి యాదగిరి, గౌడ రాజ్ కుమార్ కురుమ, చంద్రయ్య యాదవ్, దేశబోయిన సూర్యనారాయణ, సోమ రమేష్ కురుమ, నోముల సైదులు యాదవ్, బత్తిని లక్ష్మణ్ యాదవ్ పవన్, లింగమూర్తి, బసవయ్య తదితరులు పాల్గొన్నారు.

🕒 09 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/demand-to-stop-discrimination-against-animal-husbandry-and-dairy-industry/article-15112

Tags: